నిఖిల్ క్రేజీ సినిమాకు భారీగా సాటిలైట్ బిజినెస్..!

నిఖిల్ క్రేజీ సినిమాకు భారీగా సాటిలైట్ బిజినెస్..!

Published on May 18, 2015 6:00 PM IST

surya-vs-surya
‘స్వామి రారా’, ‘కార్తికేయ’ లాంటి రెండు వరుస సూపర్ హిట్ల తర్వాత ‘సూర్య vs సూర్య’తో హ్యాట్రిక్ కొట్టాడు నిఖిల్. మొదట ఈ సినిమాకి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి కలెక్షన్లను కొల్లగొట్టింది. పెట్టిన బడ్జెట్‌కి రెండింతల పైనే వసూలు చేసి నిర్మాతకు మంచి లాభాలను తెచ్చిపెట్టిందీ సినిమా. తాజాగా ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడుపోవడం విశేషంగా కనిపిస్తోంది.

గత కొంతకాలంగా సినిమాలకు సంబంధించి సాటిలైట్ మార్కెట్ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. అయితే పెద్ద సినిమాలు, క్రేజీ సినిమాలు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ మంచి సాటిలైట్ ధర పలకడం కనిపిస్తోంది. తాజాగా మీడియమ్ బడ్జెట్‌తో తెరకెక్కిన నిఖిల్ హ్యాట్రిక్ ‘సూర్య vs సూర్య’ మంచి ధర పలికింది.

శివకుమార్ నిర్మాతగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ టీవీ చానెల్ మా టీవీ సుమారుగా మూడు కోట్ల రూపాయలకు పైనే వెచ్చించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఓ చిన్న సినిమాకు ఈ స్థాయి సాటిలైట్ బిజినెస్ జరగడం నిజంగా విశేషమే. నిఖిల్ గత సినిమాలైన ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ సినిమాలు టీవీలోనూ సూపర్ హిట్‌గా నిలవడం వల్ల ‘సూర్య vs సూర్య’కు మంచి సాటిలైట్ ధర వచ్చిందని తెలుస్తోంది.

తాజా వార్తలు