కొత్తవాళ్లకు అవకాశాలిస్తేనే బాగుంటుంది : నిమ్మగడ్డ ప్రసాద్

nimmagadda-prasad
నిన్న మొన్నటి వరకూ వ్యాపార రంగంలో విజయవంతంగా కొనసాగిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఏదో సంపాదించేద్దాం అని ఇక్కడకు రాలేదు. నాగార్జున గారికి నాకు ఉన్న అనుభవం నన్నిక్కడికి నడిపింది. ఈ సినిమాలో అందరు కొత్త వాళ్ళతో చేయడం జరిగింది’ అన్నారు.

అలాగే ‘హీరోలను ఎక్కడో వెతకాల్సిన పనిలేదని, మన ముందే ఉంటారరు. టాలెంట్ ఉన్న వాళ్లకి అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అదే నా గట్టి ఉద్దేశ్యం. ఇందులో హీరో రోషన్ తో పాటు దర్శకుడు, సంగీత దర్శకుడు, టీమ్ లో చాలా మంది కొత్తవాళ్లున్నారు. ప్రతి సినిమాలో ఎంతోకంత ప్రేమ ఉంటుంది. కానీ ఈ సినిమా పూర్తిగా ప్రేమ కథ. అందరూ చాలా బాగా చేశారు. ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది’ అన్నారు.