సమీక్ష : నిన్ను తలచి – ఇంట్రస్ట్ గా సాగని రొటీన్ బోరింగ్ లవ్ డ్రామా !

సమీక్ష : నిన్ను తలచి – ఇంట్రస్ట్ గా సాగని రొటీన్ బోరింగ్ లవ్ డ్రామా !

Published on Sep 28, 2019 2:23 AM IST
Ninnu Thalachi movie review

విడుదల తేదీ : సెప్టెంబరు 27, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  1.5/5

నటీనటులు : వంశీ ఏకసిరి, స్టెఫీ పటేల్

దర్శకత్వం : అనిల్ తోటా

నిర్మాత‌లు : నేదురుమల్లి అజిత్ కుమార్ , మోదిగిరి ఓబులేష్

సంగీతం : మహావీర

సినిమాటోగ్రఫర్ : సత్య

ఎడిట‌ర్‌ : సాయి, అనిల్ తోట

 

నూతన హీరో వంశీ యాకసిరి, స్టెపీ పటేల్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు అనిల్ తోట తెరకెక్కించిన చిత్రం “నిన్ను తలచి”. ఎస్.ఎల్.ఎం ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ :

 

అభిరామ్ (వంశీ యాకసిరి) అల్లరిచిల్లరగా తిరుగే ఎబౌవ్ మిడిల్ క్లాస్ కుర్రాడు. అయితే అంకిత (స్టెపీ పటేల్)ని చూసిన తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఆ తరువాత ఆమెను ప్రేమలో పడేయడానికి అభి ఏమి చేశాడు ?మరి అంకిత అభితో ప్రేమలో పండిందా ? ఆ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అంకిత మనసులో వేరే అతను ఉన్నారని అభికి తెలుస్తోంది ? దాంతో అభి ఎమి చేశాడు ? అసలు అంకిత మనసులో ఉన్నది ఎవరు ? చివరికి అంకిత – అభి ఒక్కటయ్యారా ? లేదా ? ఒక్కటైతే వాళ్లిద్దరూ ఎలా కలిశారు ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

అనిల్ తోట దర్శకత్వంలో ఎమోషనల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో కొన్ని లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వంశీ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు.కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో అలాగే డాన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన స్టెపీ పటేల్ పర్వాలేదనిపిస్తోంది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు కూడా తన కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో సినిమాలో కనిపించనంత సేపూ నవ్వించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో స్టోరీతో పాటు డైరెక్షన్ కూడా చాలా వీక్ గా ఉంది. దీనికి తోడు స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమా ఏమాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. కథకు బలం పెంచలేని లవ్ అండ్ కామెడీ సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ కూడా లాజిక్ లేకుండా సాగడం.. అలాగే కొన్ని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం కూడా సినిమాకి మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు.

పైగా ఏ మాత్రం సినిమాను ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ తో ఆసక్తికరంగా మలచలేకపోయారు. కంటెంట్ పరంగా మంచి ఎంటర్ టైన్మెంట్ మరియు భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకులు మాత్రం సంఘర్షణ లేని సన్నివేశాలతో కథనాన్ని బాగా సాగతీశాడు.

దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించింది. బోరింగ్ ట్రీట్మెంట్ తో పాటు ఆసక్తి కలగించలేని కొన్ని కీలక సన్నివేశాల కారణంగా.. ప్లే లో సరైన ప్లో కూడా లేకుండా పోయింది. దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ ఇంకా బాగా చేయాల్సింది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. ముందు చర్చించుకున్నట్లుగానే దర్శకుడు అనిల్ తోట ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని రాసుకోలేకపోయారు. ఇక సత్య సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను ఆయన చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు మహావీర అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. సాయి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్లే సాగుతుంది. నిర్మాతలు నేదురుమల్లి అజిత్ కుమార్ , మోదిగిరి ఓబులేష్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదనిపిస్తాయి.

 

తీర్పు :

 

వంశీ యాకసిరి, స్టెపీ పటేల్ హీరోహీరోయిన్లుగా అనిల్ తోట తెరకెక్కించిన ఈ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే అక్కడక్కడా రేర్ గా వచ్చే కొన్ని లవ్ అండ్ కామెడీ సీన్స్ పర్వాలేదనిపించినా.. కథా కథనాలు అసలు ఆసక్తి కరంగా సాగక పోవడం, సినిమాలో ఎక్కడా బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు సరైన ప్లో కూడా మిస్ అవ్వడం, ఓవరాల్ గా సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం వంటి అంశాలు.. సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని కూడా నిరుత్సాహ పరుస్తోంది.

123telugu.com Rating :  1.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు