నితిన్ చెక్ మూవీ టీఆర్పీ రేటింగ్ ఎంతంటే?

Published on Jul 23, 2021 12:09 am IST


చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం చెక్. అయితే ఈ చిత్రం జూలై 11 వ తేదీన ఆదివారం సాయంత్రం 6 గంటలకు జెమిని టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుకు సంబంధించిన టీఆర్పీ బయటికి వచ్చింది. ఈ చిత్రం 8.53 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం బుల్లితెర పై ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారీర్, సిమ్రాన్ చౌదరీ, మురళి శర్మ, హర్ష వర్ధన్, పోసాని కృష్ణమురళి, సంపత్ రాజ్, కార్తీక్ రత్నం లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :