హిందీ సూపర్‌ హిట్ మూవీలో ‘నితిన్’ ?

Published on Nov 13, 2019 1:00 am IST

నితిన్ ‘ఇష్క్’ సినిమా నుండి ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘అ ఆ’ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. కానీ గత మూడు సినిమాలు ‘లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం’ ప్లాప్ లతో మళ్లీ ప్లాప్ ల పరంపరతో సతమతమవుతున్నాడు. అందుకే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఎంతో ప్లాన్ గా స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నాడు. అలా చేస్తోందే ‘భీష్మ’. కాగా తాజాగా నితిన్ ఓ హిందీ సినిమాని రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ సూపర్‌ హిట్ మూవీ ‘అంథాదూన్’ తెలుగు రీమేక్‌ లో నితిన్ నటిస్తున్నాడట.

నితిన్ తండ్రి ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి ‘అంథాదూన్’ తెలుగు రీమేక్‌ హక్కులు తీసుకున్నారట. ఇక ఈ రీమేక్ ఫిల్మ్ కి డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం నితిన్ ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తోన్న ‘భీష్మ’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

సంబంధిత సమాచారం :