నితిన్ వింటేజ్ లుక్ హైలెట్ గా భీష్మ సింగిల్స్ యాన్తం

Published on Feb 14, 2020 9:03 am IST

దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్, రష్మిక మందాన హీరో హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం భీష్మ. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్రం నుండి సింగిల్స్ యాన్తమ్ పేరుతో వీడియో సాంగ్ విడుదల చేశారు. నితిన్ డిఫరెంట్ గా వింటేజ్ లుక్స్ లో అదరగొట్టారు. 80-90 ల కాలం నాటి డ్రెస్సింగ్ స్టయిల్ అండ్ గెటప్స్ లో నితిన్ సూపర్ గా ఉన్నాడు. ఈపాటలో నితిన్ స్టెప్స్ కూడా హైలెట్ అని చెప్పాలి

లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ లేక అల్లాడిపోతున్న సింగిల్ ఫెల్లో ఫీలింగ్స్ తెలియజేస్తూ రచయిత శ్రీమణి చక్కని సాహిత్యం అందించగా, మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ వినసొంపైన బాణీలు ఇచ్చారు. ఇక ఈ సాంగ్ ని సింగర్ అనురాగ్ కులకర్ణి ట్రెండీగా పాడారు. భీష్మ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More