పవన్ తో స్క్రీన్ పంచుకోనున్న నితిన్..నిజమేనా?

Published on Oct 29, 2020 4:06 pm IST

ఇటీవలే కాలంలో ఎన్నడూ లేని విధంగా పవర్ స్టార్ పవన్ కాలిన వరుస ప్రాజెక్టులను ఓకే చేసేసి ఆశ్చర్య పరిచారు. దీనితో పవన్ చేయనున్న ఒక్కో ప్రాజెక్ట్ పై ఒక్కో రకమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే లేటెస్ట్ గా ప్రకటించిన సినిమా విషయంలో మాత్రం రోజుకో రచ్చ లేస్తూనే ఉంది.

మళయాళ చిత్రం “అయ్యప్పనం కోషియం” రీమేక్ ను పవన్ ఓకే చేసారని ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఏదొక గాసిప్ వినిపిస్తూనే ఉంది. అలా ఇపుడు మరో ఆసక్తికర అంశం విపరీతంగా హాట్ టాపిక్ అవుతుంది. ఈ చిత్రంలో పవన్ రోల్ తూ పాటు మరో ఇంపార్టెంట్ రోల్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఆ రోల్ లో పవన్ పక్కా వీరాభిమాని మార్టీ స్టార్ హీరో నితిన్ కనిపిస్తాడని గట్టిగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఒక్కసారిగా ఈ టాపిక్ పవన్ అభిమానుల్లో మంచి రసవత్తరంగా మారిపోయింది. మరి మేకర్స్ దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తారో చూడాలి. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించనుండగా థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More