భీష్మ కోసం కొత్త లుక్ లోకి మారుతున్న నితిన్ !

Published on Oct 15, 2018 9:31 pm IST

యువ హీరో నితిన్ ను ఇటీవల వరుస పరాజయాలు పలకరించడంతో ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రం ఫై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ‘బీష్మ’ అనే చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. ఈసినిమా కోసం నితిన్ కొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడట. దాంట్లో భాగంగా బరువు తగ్గి కొత్త హెయిర్ స్టైల్ తో సన్నద్ధం అవుతున్నాడట.

ఈచిత్రంలో నితిన్ కంప్లీట్ న్యూ మేక్ ఓవర్ లో కనిపించనున్నాడని సమాచారం. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిచనుండగా సితార ఎంటెర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. డిసెంబర్ నుండి ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది. ఇక ఈ చిత్రం ఫై నితిన్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :