నితిన్ సినిమాకి కమల్ హాసన్ మద్ధతు.. ఎలా అంటే?

Published on May 30, 2022 11:00 pm IST

యూత్ స్టార్ నితిన్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి మరియు నిఖితా రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు భారీ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఏకంగా విశ్వనటుడు కమల్ హాసన్ భాగం కాబోతున్నాడు. అదేలా అంటారా కమల్ హాసన్ హీరోగా నటించిన “విక్రమ్” సినిమా తెలుగు రైట్స్ నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రేపు విక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. వీరితో పాటు నితిన్ కూడా ఈ ఈవెంట్‌కు హాజర్ కానున్నాడు.

అయితే ఈ వేదికపై నితిన్ సినిమా “మాచర్ల నియోజకవర్గం”లోని మొదటి సాంగ్‌ని కమల్ హాసన్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. “చిల్ మారో చిల్ మారో” అంటూ సాగే ఈ పాటను రేపు విడుదల చేయబోతున్నామని నితిన్ తెలిపాడు. ఈ పోస్టర్‌లో నితిన్ మరింత స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :