డైరెక్ట్ ఓటిటి గా నితిన్ మాస్ట్రో!

Published on Jul 20, 2021 6:18 pm IST


మేర్లపాక గాంధీ దర్శకత్వం లో నితిన్ హీరోగా, నబ్బా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. అయితే ఈ చిత్రం వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు, వీడియోలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఈ చిత్రం డైరక్ట్ ఓటిటి గా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ రెండవ వారం లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. అయితే ఈ చిత్రం విడుదల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే థియేటర్లు ప్రారంభం అయినప్పటికి కొన్ని చిత్రాలు ఓటిటి లో విడుదల కి సిద్దం అవుతున్నాయి. ఆకాశవాణి, దృష్యం 2 చిత్రాలు డైరెక్ట్ ఓటిటి గా విడుదల అవుతున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న మాస్ట్రో చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి లు శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :