నితిన్ కొత్త సినిమా ప్రారంభం !
Published on Mar 4, 2018 10:25 am IST

నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమా ఈరోజు ఉదయం 7:50 గంటలకు ప్రారంభం అయ్యింది. రాశిఖాన్న, నందిత శ్వేతా హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమాకు సతీష్ వేగ్నేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

నితిన్ ప్రస్తుతం చల్ మోహన్ రంగ సినిమా వర్క్ లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమకు తమన్ సంగీతం అందించాడు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.

 
Like us on Facebook