డిసెంబర్ నుండి నితీన్ కొత్త సినిమా ప్రారంభం !

డిసెంబర్ నుండి నితీన్ కొత్త సినిమా ప్రారంభం !

Published on Oct 9, 2018 10:09 PM IST

Nithin

వరుస పరాజయాలతో నిరాశ పరిచిన యువ హీరో నితీన్ కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఆయన ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించనున్నాడని తెలిసిందే. ‘భీష్మ’ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈచిత్రంలో నితిన్ కు జోడిగా రష్మిక నటించనుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక ‘చల్ మోహన్ రంగ , లై , శ్రీనివాస కళ్యాణం’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసిన నితిన్ ఈ సినిమాతోనైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

తాజా వార్తలు