నితిన్ రంగ్ దే పై ఇంట్రెస్టింగ్ అప్డేట్

Published on Mar 28, 2020 10:00 pm IST

నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రంగ్ దే. ఈ చిత్రంలో మొదటిసారి కీర్తి సురేష్ నితిన్ కి జంటగా నటిస్తుంది. కాగా రేపు ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు రంగ్ దే మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు చెప్పడం జరిగింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. చాల గ్యాప్ తరువాత భీష్మ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు నితిన్. ఆ సినిమాకు కూడా నిర్మాత నాగవంశీ కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రంగ్ దే సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More