చిత్రీకరణకు రంగం సిద్ధం చేసుకుంటున్న ‘భీష్మ’

Published on Aug 7, 2018 8:17 am IST

నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రం త్వరలో తెరకెక్కటానికి రంగం సిద్ధం అవుతుంది. కాగా ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ‘ఛలో’ మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేశారట. ఈ నెల ఆఖర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మొదట ఆగష్టు మొదటి వారంలోనే షూట్ మొదలపెట్టాలని చిత్రబృందం భావించినప్పటికీ, నితిన్ శ్రీనివాస కళ్యాణం చిత్రంతో బిజీగా ఉండటం కారణంగా ఆలస్యం అయిందని తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం ఆగష్టు 9న విడుదల అవ్వనుంది. దాంతో నితిన్ ఈ నెల ఆఖర్లోకల్లా పూర్తిగా భీష్మ చిత్రానికి అందుబాటులో ఉండనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన హన్సికను హీరోయిన్ గా నటిస్తోంది. గతంలోనే నితిన్ హన్సిక ‘సీతారాముల కళ్యాణం లంకలో’ అనే చిత్రంలో కలిసి నటించారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.

సంబంధిత సమాచారం :

X
More