విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోనున్న నితిన్ కొత్త సినిమా !
Published on Oct 5, 2016 8:39 am IST

nithin
‘అ..ఆ..’ విజయం తరువాత హీరో నితిన్ స్టార్ డమ్ ఏమంటాం పెరిగిపోయింది. ఆయన మార్కెట్ పరిధి కూడా బాగా విస్తరించింది. దీంతో ఆయన తన నెక్స్ట్ సినిమాని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. చాలా కథలు విన్న తరువాత ఫైనల్ గా ‘కృష్ణగాడి వీరప్రేమ గాధ’ ఫేమ్ హను రాఘవపూడితో ప్రాజెక్ట్ ఓకే చేశాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం నవంబర్ మధ్యలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

ఇకపోతే కథ ప్రకారం ఈ చిత్రం ఎక్కువ భాగం అనగా 80 శాతం వరకూ విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంటుందట. అందుకోసం యూనిట్ యూరప్, అమెరికా వంటి దేశాల్లో షూటింగ్ లొకేషన్స్ కొరకు వెతుకులాట మొదలుపెట్టేశాయట. ఈ చిరాన్ని 14 రీల్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా రానున్న ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర ప్రధాన తారాగణం ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook