ఎన్టీఆర్ కోసం డబ్బింగ్ చెప్పిన నిత్యామీనన్ !

Published on Dec 8, 2018 11:26 am IST

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రగా.. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్ లో సెకెండ్ పార్ట్ ‘మహానాయకుడు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

కాగా ఈ బయోపిక్ లో ‘మహానటి’ సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ -సావిత్రి చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందులో కొన్ని క్లాసిక్ చిత్రాలుగా నిలిచాయి. వాటిల్లో ముఖ్యంగా మాయాబజార్, మిస్సమ్మ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ సంఘటనలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు. ఇప్పటికే నిత్యామీనన్ పై చిత్రబృందం ఆ సన్నివేశాల తాలూకు సీన్స్ ను కూడా షూట్ చేశారు.

ఐతే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం నిత్యామీనన్ ఈ చిత్రానికి సంబంధించి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పిందట. ఇక కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :