శర్వానంద్ తో హీరోయిన్ మూడోసారి?
Published on Nov 27, 2017 11:54 am IST

హీరో శర్వానంద్ నటించిన మహానుభావుడు సినిమా మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ గతవారం హను రాగవపుడి దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టాడు ఈ హీరో. ఈ మూవీ తర్వాత శర్వానంద్ నటించబోయే మరోసినిమా ఈ రోజు ప్రారంభం అయ్యింది.స్వామి రారా సినిమా దర్శకుడు సుదీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

శర్వానంద్ నిత్యా మీనన్ గతంలో మళ్ళిమళ్ళి ఇదిరానిరోజు, రాజాధి రాజ సినిమాల్లో కలిసి నటించారు మూడోసారి వీరిద్దరూ కలిసి సుదీర్ వర్మ సినిమా కోసం కలిసి పనిచేయడం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత శర్వానంద్ దిల్ రాజు సంస్థలో మరో సినిమా చెయ్యబోతున్నాడు.

 
Like us on Facebook