రవితేజ సినిమాలో నటించడంలేదన్న నివేత థామస్ !

రవితేజ సినిమాలో నటించడంలేదన్న నివేత థామస్ !

Published on Feb 6, 2018 1:40 PM IST

ఇటీవలే ‘టచ్ చేసి చూడు’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన రవితేజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత ఏప్రిల్ నెలలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు మాస్ మహారాజ. ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే భిన్నమైన టైటిల్ తో రానున్న ఈ చిత్రంలో రవితేజ మూడు లుక్స్ లో కనిపించనున్నాడని టాక్.

అంతేగాక ఇందులో ఒక పాత్ర సరసం మలయాళ బ్యూటీ నివేతా థామస్ నటిస్తుందని బలమైన వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ వార్తల్లో ఏమాత్రం నిజంలేదని నివేతా థామస్ ట్విట్టర్ ద్వారా వేరొకరికి సమాధానమిస్తూ క్లారిటీ ఇచ్చారు. అలాగే కాజల్ అగర్వాల్ కూడా ఇందులో నటిచనుందని గుసగుసలు వినబడ్డాయి. మరి వాటిలో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే నిర్మాణ సామ్సతః మైత్రీ మూవీ మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వెలువడే వరకు ఎదురుచూడాల్సిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు