డైరెక్షన్ ఇష్టమంటున్న మరో హీరోయిన్ !

డైరెక్షన్ ఇష్టమంటున్న మరో హీరోయిన్ !

Published on Jul 19, 2021 4:02 AM IST

Nivetha Pethuraj

హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నివేత పేతురాజ్ కి మంచి గుర్తింపు వచ్చింది. పైగా ఈ బ్యూటీ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ కూడా. అయితే, తనలో డైరెక్షన్ స్కిల్ కూడా ఉందని.. భవిష్యత్తులో కచ్చితంగా డైరెక్షన్ చేస్తానని చెబుతోంది ఈ హీరోయిన్. హీరోయిన్ గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నివేత పేతురాజ్, సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ స్టార్ గా ఎదిగింది. వరుస సినిమాలు చేస్తూనే గ్యాప్ వచ్చిన సమయంలో డైరెక్షన్ కోర్సు కూడా చేసిందట.

అందుకే, భవిష్యత్తులో ఎలాగైనా దర్శకత్వం వహిస్తానని, అయితే ఇంకా తానూ మంచి పాత్రలు చేయాలని, నటిగా కొన్నేళ్ల ప్రయాణం తరువాత, డైరెక్టర్ గా మారతాను అని, నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని అంటుంది నివేత. కాకపోతే ఇప్పట్లో మూవీ డైరక్షన్ కోసం ప్రయత్నాలు చేయదట. మరి చూడాలి డైరెక్టర్ గా నివేత పేతురాజ్ ఎలాంటి సినిమాలు చేస్తోందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు