‘దువ్వాడ జగన్నాథం’ బెనిఫిట్ షోల మాటేమిటి !
Published on Jun 20, 2017 4:40 pm IST


అల్లు అర్జున్ అభిమానులకు ఇది కాస్త నిరుత్సాహకరమైన వార్తనే చెప్పాలి. అదేమిటంటే బన్నీ నటించిన తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ కు బెనిఫిట్ షోలు లేకపోవడం. ఈ నిర్ణయాన్ని స్వయంగా చిత్ర యూనిటే తీసుకుందని తెలుస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు, నిర్మాతలు తమ సినిమాలకు బెనిఫిట్ షోలు ఉండాలని, మంచి ఓపెనింగ్స్ రావాలని అనుకుంటారు. కానీ డీజే టీమ్ మాత్రం అలాంటివేమీ వద్దంటోందట.

ఎందుకంటే బెనిఫిట్ షోల ద్వారా బయటికొచ్చే పాజిటివ్ టాక్ చేసే మేలు కన్నా నెగెటివ్ టాక్ కలిగించే హానే ఎక్కువని అందుకే సినిమాను నేరుగా 23 ఉదయమే ప్రదర్శించాలని టీమ్ భావిస్తోంది. అంతేగాక బన్నీ గత చిత్రం ‘సరైనోడు’ కూడా ఎలాంటి బెనిఫిట్ షోలు లేకుండానే నేరుగా విడుదల తేదీ రోజునే థియేటర్లలోకి వచ్చి ఘన విజయం అందుకుంది. కాబట్టి ఈ నిర్ణయం వలన ఆ సెంటిమెంట్ కూడా వర్కవుటైనట్టు ఉంటుందనేది టీమ్ అభిప్రాయం కావొచ్చు.

 
Like us on Facebook