అనుకున్న తేదికే థియేటర్ల లో భీమ్లా నాయక్..!

Published on Oct 26, 2021 12:20 am IST


పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం ను వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి ఓటిటి ల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నప్పటికీ థియేటర్ల లోనే విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అంతేకాక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఎక్కువగా ఉండటం తో ఏవైనా తేదీ లు మారే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ మాత్రం అనుకున్న తేదీకి థియేటర్ల లో విడుదల కాబోతుంది.

ఈ చిత్రం లో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కి మాటలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :