
టాలీవుడ్ లో కాస్త వైవిధ్యమైన దర్శకుడిగా రవిబాబుకి మంచి పేరు ఉంది. గత రెండు సంవత్సరాలుగా ఆయన ‘అదుగో’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో పందిపిల్ల కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం మీద మంచి ఆసక్తి ఏర్పడింది. పైగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో వస్తుండటంతో ‘అదుగో’ మీద మంచి అంచనాలే ఉన్నాయి.
అయితే ‘అదుగో’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం గతంలోనే సన్నాహాలు చేసింది. కానీ ఇంతవరకు ఈ సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కోసం కొత్తదనం కోరుకొన్నే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ ఇటు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి గాని, అటు దర్శకుడు రవిబాబు నుంచి గాని ఎలాంటి స్పందన లేదు. ఇంక ప్రయోగాత్నక చిత్రానికి మోక్షము ఎప్పుడో ?

