ఈ మెగా హీరోకు పోటి లేదు !
Published on Mar 1, 2018 5:40 pm IST

రంగస్థలం షూటింగ్ పార్ట్ పూర్తయిపోగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మరోవైపు ప్రమోషనల్ వర్క్ స్పీడ్ గా జరుగుతున్నాయి. మొదటిపాటను విడుదల చేసిన చిత్ర యూనిట్ రేపు సాయంత్రం రెండో పాటను విడుదల చెయ్యనున్నారు. దీవి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

మర్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. మర్చి 29 న మహానటి విడుదల కావాలి కాని ఆ సినిమా రావట్లేదు. వర్క్ బాగా పెండింగ్ ఉండడంతో చిత్ర విడుదల వాయిదా పడింది. మర్చి 30న ఏ సినిమాలు రావట్లేదు. సోలో రిలీజ్ కావడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. యూనిట్ విడుదలచేసే సినిమా పోస్టర్స్ లూక్స్ ఆకట్టుకుంటున్నాయి.

 
Like us on Facebook