ఈసారి మిస్టర్ బాక్సాఫీస్, శంకర్ ల బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ కి నో డౌట్.!

Published on Jul 22, 2021 5:02 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న ఇంకో సాలిడ్ ట్యాగ్ నే మిస్టర్ బాక్సాఫీస్ తన యావరేజ్ సినిమాల్తో కూడా మినిమమ్ గ్యారంటీ వసూళ్లు రాబట్టగలిగే చరణ్ ఇప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ లో పాగా వేసేందుకు సంసిద్ధం అవుతున్నాడు. మొదటగా రాజమౌళితో “RRR” అనే సినిమాతో ఎంటర్ కానుండగా దాని తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ సెట్ చేస్తాడా అనుకున్న సమయంలోనే ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తో అనౌన్స్ చేసి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేసాడు.

అయితే చాలా మిస్టరీల తర్వాత లైన్ క్లియర్ చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ సినిమా గతంలో అప్పుడు మొదలవుతుంది ఇప్పుడు మొదలవుతుంది అని నెట్టుకుంటూ రాగా ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సెప్టెంబర్ నెల నుంచే మొదలు కావడం కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌట్ పెట్టుకోనక్కర్లేదు అని లేటెస్ట్ టాక్. పర్టిక్యులర్ గా ప్రాజెక్ట్ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి శంకర్ ఈసారి ఎలాంటి సబ్జెక్ట్ తో బాక్సాఫీస్ ను ఢీ కొట్టనున్నారో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :