రామ్ సినిమాలో హీరోయిన్ ఖరారు కాలేదు !
Published on Nov 30, 2017 3:00 pm IST

రామ్ హీరోగా త్రినాద్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో సినిమా ఈమధ్య అనౌన్స్ చేసారు. ప్రసన్న కుమార్ ఈ సినిమాకు రచయిత. ఫిబ్రవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన తరువాత రామ్ సరసన కీర్తి సురేష్ నటించబోతుందని రకరకాల వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో హీరొయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. కీర్తి సురేష్ ను ఈ చిత్ర బృందం సంప్రదించలేదని తెలుస్తోంది. ఈ హీరోయిన్ కాకుండా వేరే మరే హీరొయిన్ అయిన రామ్ తో నటించే అవకాశం ఉంది. త్వరలో చిత్ర యూనిట్ హీరొయిన్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండబోతుందని వినికిడి.

 
Like us on Facebook