ఇంకో రెండు వారాల పాటు పవన్, బాలయ్యలకు అడ్డే లేదు !

agnya jai gang rangula1

జనవరి 10, 12వ తేదీల్లో పవన్ ‘అజ్ఞాతవాసి’, బాలకృష్ణ ‘జై సింహ’ చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో పవన్ చిత్రం కొంత నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుని నడుస్తుండగా, ‘జై సింహ’ మిక్స్డ్ టాక్ తో బి, సి సెంటర్లలో బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. అలాగే 12న వచ్చిన సూర్య ‘గ్యాంగ్’ మంచి టాక్ ను తెచ్చుకోగా నిన్నే వచ్చిన రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ బిలో యావరేజ్ టాక్ తో నడుస్తోంది.

ఇలా బాక్సాఫీస్ ముందు కొంచెం కష్టపడుతున్న ఈ చిత్రాలకు ఓ అంశం మాత్రం బాగా కలిసొచ్చింది. అదేమిటంటే రాబోయే రెండు వారలు తెలుగులో ఏ పెద్ద చిత్రం విడుదలకావడంలేదు. ఒకేసారి జనవరి 26న అనుష్క ‘భాగమతి’, విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, సందీప్ కిషన్ ‘మనసుకు నచ్చింది’ వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి.

కాబట్టి అప్పటి వరకు సంక్రాంతి సినిమాలకు అడ్డనేదే ఉండదు. మరి ఈ నాలుగింటిలో ఏ చిత్రం ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుంటుందో చూడాలి.

Exit mobile version