దీపావళికి పవన్ సినిమా ఫస్ట్ లుక్ లేనట్టే !
Published on Oct 17, 2017 7:01 pm IST

పవన్ కళ్యాణ్ తన 25వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సినిమా విడుదల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అంతకంటే ముందుగా ఫస్ట్ లుక్ విడుదల ఎప్పుడెప్పుడు ఉంటుందా అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలోనే ఫస్ట్ లుక్ ను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తారనే వార్తలు వినిబడ్డాయి.

కానీ ఈ వార్తపై ఇప్పటి వరకు చిత్ర నిర్మాణ సంస్థ హారిక, హాసిని క్రియేషన్స్ నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానుల్లో నిరుత్సాహం ఆవరించింది. ఇక సినీ వర్గాల సమాచారం మేరకైతే ఈ దీపావళికి ఫస్ట్ లుక్ లేదనే వుదయం రూఢీ అవుతోంది. మరి ఫస్ట్ లుక్, టైటిల్ ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ప్రచారంలో ఈ చిత్రంలో పవన్ కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 
Like us on Facebook