నాని “దసరా” లో సెకండ్ హీరోయిన్ లేనట్టే!

Published on Nov 8, 2021 5:56 pm IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. ఈ చిత్రం కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల కి ఇది తొలి చిత్రం. దసరా అనే ఈ భారీ చిత్రం టైటిల్ ప్రకటన నుండి సినిమా పై ఆసక్తి నెలకొంది.

అయితే ఈ సినిమా లో మరొక హీరోయిన్ పాత్ర కోసం సమంత ను సంప్రదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఎలాంటి వాస్తవం లేకపోవడం తో ఈ సినిమా లో సెకండ్ హీరోయిన్ లేదు అంటూ సరికొత్త గాసిప్ పుట్టుకొచ్చింది. ఈ సినిమా లో కీర్తి సురేష్ మాత్రమే హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా, ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :