గోపీచంద్ సినిమా వార్తలో నిజం లేదు !
Published on Mar 13, 2018 11:00 pm IST

గోపీచంద్ ప్రస్తుతం పంతం సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది మేలో ఈ సినిమా విడుదల కానుంది. చక్రి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ లో మెహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ చేస్తోన్న 25వ సినిమా ఇదే అవ్వడం విశేషం. ఈ సినిమా తరువాత గోపీచంద్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నాడు.

తాజాగా గోపీచంద్ బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాని ఆ న్యూస్ లో నిజం లేదని తెలుస్తోంది. సంతోష్ శ్రీనివాస్, గోపీచంద్ సినిమా ఉగాది రోజున ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు గోపీచంద్ దగ్గరి సన్నిహితులు చెబుతున్నారు. ఇంతవరుకు బొమ్మరిల్లు భాస్కర్ గోపీచంద్ ను కలవడం కూడా జరగలేదని తెలుస్తోంది.

 
Like us on Facebook