నాన్ స్టాప్ షూటింగ్ లో చిత్ర లహరి !

Published on Dec 24, 2018 9:25 pm IST

‘తేజ్ ఐ లవ్ యు’ తరువాత సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కొంచం గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ‘చిత్రలహరి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ షూటింగ్ కోసం రామానాయుడు స్టూడియోస్ లో కోటి రూపాయలతో భారీ సెట్ ను నిర్మించారు. ప్రస్తుతం అందులోనే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యిందని సమాచారం. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ‘హలో’ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ అలాగే తమిళనటి నివేత పేతురాజ్ హిరోయిన్లుగా నటిస్తున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈచిత్రంలో తేజు గడ్డం తో కొత్తలుక్ లో కనిపించనున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :