తెలుగు, తమిళంలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోస్ కింగ్ నాగార్జున – యంగ్ హీరో కార్తీ కాంబినేషన్ లో ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న మల్టీ స్టారర్ మూవీ ‘ఊపిరి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించనుంది. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ ని హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. ఈ పాటలో ప్రెజంట్ టాలీవుడ్ ఐటెం లేడగా మంచి పేరు తెచ్చుకున్న నోర ఫతేహి స్టెప్స్ వేస్తోంది.
ఈ పాటలో కేవలం నోర ఫతేహి మాత్రమే కాకుండా మిల్క్ బ్యూటీ తమన్నా కూడా సూపర్బ్ స్టెప్స్ వేస్తోంది. ‘బ్యూటిఫుల్ నోర ఫతేహితో కలిసి ఊపిరి సినిమా కోసం ఓ పాత చేస్తున్నాను. సూపర్బ్ ఫన్ ఉండే సాంగ్ ఇదని’ తమన్నా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. నోర ఫతేహి అండ్ తమన్నా ఇద్దరూ మంచి డాన్సర్స్. అలాంటి వీరిద్దరిపైన షూట్ చేస్తున్న ఈ పాట థియేటర్స్ లో ప్రేక్షకులకి కన్నుల పండుగగా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. ఈ చిత్ర టీం ఊపిరి రిలీజ్ కోసం 2016 ఫిబ్రవరి 5ని లాక్ చేసింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో అనుష్క – అడవి శేష్ జంటగా కనిపించనున్నారు. హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్’ కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతోంది. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్.


