“సర్కారు” నుంచి సింగిల్ కాదు డబుల్ ట్రీట్ పక్కా.!?

Published on Jul 21, 2021 7:02 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురాం పెట్ల సాలిడ్ స్క్రిప్ట్ అండ్ సీక్వెన్స్ లతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఎప్పటి నుంచో మాస్ ట్రీట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

మరి వాటిలో ఫస్ట్ లుక్ ట్రీట్ వచ్చే ఆగస్ట్ నెలలో మహేష్ బర్త్ డే సందర్భంగా ఆల్రెడీ లాక్ అవ్వగా మరి ఇదే ఆగస్ట్ లో మరో సాలిడ్ ట్రీట్ కూడా ఉన్నట్టు అర్ధం అవుతుంది. ఇది వరకు థమన్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ దాదాపు ఆగస్ట్ లొనే వదలడానికి ప్రయత్నం చేస్తామని తెలిపాడు.

ఇప్పుడు మళ్లీ ఆ ముఖంగానే హింట్ ఇస్తున్నాడు. సో ఈ చిత్రం నుంచి సింగిల్ కాదు డబుల్ ట్రీట్ పక్కా అని అర్ధం అవుతుంది. థమన్ నుంచే హింట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ సింగిల్ అని అనుకోవచ్చు. మరి ఆ అప్డేట్ ఏనా లేక ఇంకేమన్నా ఉందా అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :