పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రం “బ్రో”. దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం అయితే డే 1 డీసెంట్ గా స్టార్ట్ అయ్యినప్పటికీ డే 2 కూడా సూపర్ హోల్డ్ ని కనబరిచినట్టుగా తెలుస్తుంది. అలాగే యూఎస్ లో కూడా 1 మిలియన్ క్లబ్ లో చేరి స్ట్రాంగ్ హోల్డ్ అయితే ఈ చిత్రం అందుకుంది.
అయితే ఈ చిత్ర సక్సెస్ ఫార్ములాలో సినిమాకి వర్క్ చేసిన దర్శకుడు సముద్రఖని అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, అలాగే థమన్ లు ఇచ్చిన సంగీతం ఓ రేంజ్ లో సినిమాని నిలబెట్టాయి. అయితే సినిమాలో వీరి అందరి హైలైట్ వర్క్స్ తో పాటుగా మరొకరికి డెఫినెట్ గా స్పెషల్ అప్లాజ్ అందించాలి.
మరి వారు ఎవరో కాదు సినిమాలో పవన్ మరియు సాయి ధరమ్ తేజ్ లను సూపర్ స్టైలిష్ గా చూపించిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా అని చెప్పాలి. మెయిన్ గా పవన్ కి అయితే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ఎప్పుడో పవన్ వదిలేసిన సూపర్ స్టయిల్ వర్క్స్ అన్నీ మళ్ళీ చూసినట్టు అయ్యింది.
ఇక సినిమాలో అయితే పవన్ ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పాలి. వీటితో డెఫినెట్ గా ఆమెకి కూడా మంచి క్రెడిట్ దక్కుతుంది అని చెప్పాలి. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.


