నోటా అక్కడ అదరగొడుతుంది !

Published on Oct 7, 2018 12:06 pm IST


విజయ్ దేవరకొండ నటించిన ద్విబాషా చిత్రం ‘నోటా’ మొన్న విడుదలై తెలుగులో నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. విజయ్ అభిమానులను త్రీవంగా నిరాశపరిచింది ఈచిత్రం. ఇక ఇది ఇలావుంటే తమిళంలో మాత్రం ఈచిత్రం ఇందుకు బిన్నంగా పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. తమిళ నేటివిటీ ఎక్కువగాఉండడంతో అక్కడి ప్రేక్షుకులు ఈ చిత్రానికి బాగానే కనెక్ట్ అవుతున్నారు. దాంతో ఈ చిత్రంతో విజయ్ తమిళ్లో కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్లే అయ్యింది.

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 14కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మించారు.

సంబంధిత సమాచారం :