దేవదాస్ కనకాల ఇకలేరు !

Published on Aug 2, 2019 4:04 pm IST

ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల ఇకలేరు. ఎన్నో సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి మెప్పించిన ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యల వల్లే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.

నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవదాస్ కనకాల.. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే కావడం విశేషం. ఈయన 1945లో జూలై 30న యానంలో జన్మించారు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట.

123తెలుగు.కామ్ తరఫున దేవదాస్ కనకాల మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :