“పుష్ప” రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నటుడు.!

Published on Jul 20, 2021 2:58 pm IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో రచ్చ చెయ్యడానికి సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమాలో సుకుమార్ క్యాస్టింగ్ పరంగా కూడా ఎంత పక్కాగా ఉంటారో తెలిసిందే..

మరి లేటెస్ట్ గా ఈ చిత్రంలో ప్రముఖ టాలెంటెడ్ నటుడు అనీష్ కురువిల్లా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని పలు ఊహాగానాలు వైరల్ కాగా వాటికి అనీష్ చెక్ పెట్టారు. తనపై వస్తున్న ఈ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని తెలిపాడు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో నటించాలని తనకి కూడా ఉందని కానీ ఈ సినిమాలో మాత్రం తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ భారీ చిత్రం రెండు పార్టులకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :