కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే జన నాయకుడు. తమిళ్ ప్లస్ తెలుగులో రిలీజ్ కి రానున్న ఈ సినిమాతో విజయ్ తన సినీ కెరీర్ ని ముగించబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఆల్రెడీ సాంగ్స్ మంచి ట్రీట్ ఇస్తుండగా మేకర్స్ ఓ సాలిడ్ న్యూస్ అభిమానులకి అందించారు.
ఈ సినిమా తాలూకా శాటిలైట్ హక్కులు ప్రముఖ ఛానెల్ జీ తమిళ్ వారు సొంతం చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేసారు. సో థియేటర్స్, ఓటీటీ తర్వాత ఇందులో రానుంది అని చెప్పాలి. దాదాపుగా తెలుగు కూడా ఇదే సంస్థకి చెంది ఉండొచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కె వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.


