“RRR” సినిమాని రికమెండ్ చేస్తున్న ప్రముఖ హాలీవుడ్ విలన్.!

“RRR” సినిమాని రికమెండ్ చేస్తున్న ప్రముఖ హాలీవుడ్ విలన్.!

Published on Aug 26, 2022 3:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ రికార్డులు వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమా ప్రముఖ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చాక అయితే ప్రపంచ వ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయింది.

ఈ సినిమాని అనేకమంది హాలీవుడ్ ప్రముఖులు కొనయాడడం తెలుగు సినిమా సహా ఇండియన్ సినిమాకి ఎంతో గర్వ కారణంగా మారింది. సినిమా ఓటిటి లో వచ్చి 15 వారాలు అవుతున్నా కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రస్తావన ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండని రోజు లేదు.

మరి లేటెస్ట్ గా అయితే బ్రిటన్ కి చెందిన ఓ ప్రముఖ హాలీవుడ్ విలన్ జోసెఫ్ మోర్గాన్ నెట్ ఫ్లిక్స్ నుంచి నో డౌట్ గా RRR సినిమాని తన ఫాలోవర్స్ కి రికమెండ్ చేస్తున్నాడు. “అలెగ్జాండర్”, ‘ఇమ్మోర్టల్స్”, “బెన్ హర్”, “వేంపైర్ డైరీస్” ఇలా ఎన్నో ప్రముఖ సినిమాలు సిరీస్ లలో తాను నటించాడు. దీనితో ఈ ట్వీట్ ఇప్పుడు మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు