తారక్ సినిమాకు పనిచేయనున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్

తారక్ సినిమాకు పనిచేయనున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్

Published on May 20, 2015 11:05 PM IST

ntr1
తారక్ – సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి విజయ్ చక్రవర్తి కెమెరా బాధ్యతలను మోయనున్నాడు. విజయ్ గతంలో బొమ్మరిల్లు, పరుగు, మిస్టర్ పర్ఫెక్ట్, ఓయ్ వంటి సినిమాలకు పనిచేసాడు. జూన్ మొదటివారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. జగపతిబాబు ఒక ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు.

‘నాన్నకు ప్రేమతో’ అన్నవర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. సుకుమార్ మరోసారి సరికొత్త కధాకధనాలతో సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు.బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ – రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు