ఫేస్‌బుక్‌లోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అఫిషియ‌ల్ పేజ్ స్టార్ట్‌..!

Published on Oct 31, 2018 10:17 am IST

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా సామాజిక మాధ్య‌మాల్లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్న ఫేస్‌బుక్‌లోకి ఎంట‌ర్ అయ్యాడు. తాజాగా త‌న పేరుతో అధికారికంగా ఫేస్‌బుక్ పేజీని పారంభించిన ప‌వ‌న్.. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. త‌న అభిమానుల‌కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకే ఫేస్‌బుక్‌లోకి ఎంట్రీ ఇచ్చాన‌ని ప‌వ‌న్ తెలిపారు. ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ లాంటి సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్‌లో ఉన్నా.. సామాన్యుల‌కు మ‌రింత చేరువ కావ‌డానికే తాను ఈ ఫేస్‌బుక్ పేజ్‌ని ఏర్పాటు చేశాన‌ని ప‌వ‌న్ అన్నారు.

ఇక అంతే కాకుండా జ‌న‌సేన సిద్ధాంతాలు.. పార్టీ కార్య‌క్ర‌మాలు ఎప్ప‌టి క‌ప్పుడు తెలిపేందుకే ఫేస్‌బుక్ పేజీని ఏర్పాటు చేశాన‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇక ఈ క్ర‌మంలో తాను న‌వంబ‌ర్ 2 నుండి విజ‌య‌వాడ నుండి తుని వ‌ర‌కు రైలు యాత్ర చేయ‌నున్నాని ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. అంతే కాకుండా ఈ రైలు యాత్ర‌కి సంబంధించి ప్ర‌ణాళిక‌ల‌న్నీ పూర్తి అయ్యాయ‌ని.. ఈ యాత్ర ద్వారా రైలులోనే ప్ర‌జ‌ల‌తో ప‌లు స‌మ‌స్య‌ల పై చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించున్న‌ట్టు ప‌వ‌న్ తెలిపారు. దీంతో ప‌వన్ ఫేస్‌బుక్ ఎంట్రీతో ఆయ‌న అభిమానుల పండుగ చేసుకుంటున్నార‌ని స‌మాచారం.

సంబంధిత సమాచారం :