ఇప్పుడీ టాలీవుడ్ రికార్డ్ చరణ్ కంట్రోల్ లో.!

Published on Oct 31, 2020 11:01 am IST

ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మన టాలీవుడ్ లో అందని ద్రాక్షగా నిలిచిన 1 మిలియన్ లైక్డ్ టీజర్ రికార్డును తన RRR లోని భీం టీజర్ తో కొట్టి సంచలనం రేపాడు. ఇప్పుడు ఈ తేవర్ హవా ఇంకా అలా కొనసాగుతుండగా ఇదే చిత్రంలో అల్లూరిగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పై వచ్చిన రామరాజు టీజర్ కూడా మన టాలీవుడ్ లో అనేక రికార్డులను నెలకొల్పి ఇప్పుడు ఒక ఆల్ టైం రికార్డును అందుకుంది.

లేటెస్ట్ గా 33.3 మిలియన్ వ్యూస్ మార్కును అందుకొని మన టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ అందుకున్న టీజర్ గా నిలిచింది. దీనికి ముందు సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు” టీజర్ ఉంది. మొత్తానికి మాత్రం ఇప్పుడు ఈ రికార్డు చరణ్ కంట్రోల్ లోకి వచ్చేసింది. మరి దీనిని భీం టీజర్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More