ఇక అసలు పనిలో పడ్డ “వకీల్ సాబ్” మేకర్స్.!

Published on Mar 19, 2021 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించారు. మరి ఇప్పటికే తన టేకింగ్ మరియు మార్పులు చేర్పులకు మంచి మార్కులు పడ్డాయి. దీనితో సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

కానీ ఇప్పుడు టైం దగ్గర పడుతుండడంతో ఇంకా సరైన ప్రమోషన్స్ జరగడం లేదని కొన్ని రోజులుగా టాక్ ఉంది. కానీ మేకర్స్ మాత్రం ఇప్పుడు అదే పనిలో ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. అలాగే మరోపక్క ఆఫ్ లైన్ లో ఆల్రెడీ ఈ సినిమా ప్రమోషన్స్ కు రచ్చ మొదలవ్వగా పవన్ కూడా తన డబ్బింగ్ ను కొన్ని రోజుల కితమే స్టార్ట్ చేసేసినట్టు తెలుస్తుంది.

దీనితో పాటుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా కనీ వినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారని కూడా తెలిసింది. మొత్తానికి మాత్రం మేకర్స్ వకీల్ సాబ్ రచ్చ ను షురూ చేసేసారు అని చెప్పాలి. థమన్ సంగీతం ఇస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రలు చేసిన ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 9న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :