అఫీషియల్ : ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ రిలీజ్ ఫిక్స్

Published on May 17, 2023 8:36 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక భారీ మాస్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ పాన్ ఇండియన్ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ బర్త్ ని పురస్కరించుకుని మే 19న విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కత్తులని నేలపై గుచ్చి ఉన్న డిఫరెంట్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.

దీనిని బట్టి ఈ మూవీ భారీ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ మూవీలో పవర్ఫుల్ రోల్ చేస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ ఇందులో నెగటివ్ రోల్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ని అన్ని కార్యక్రమాలు ముగించి 204 ఏప్రిల్ 5 న గ్రాండ్ లెవెల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :