బ్రదర్స్ గా నటించబోతున్న చరణ్, ఎన్టీఆర్ !

రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా ను తాజాగా అనౌన్స్ చేసారు. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ బ్రదర్స్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. భారి బడ్జెట్ తో తెరకేక్కబోతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

రాజమౌలి ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసారు. ఇటీవల చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమా కోసం స్పెషల్ షూట్ లో పాల్గొనడం జరిగింది. త్వరలో ఆ లూక్స్ ను విడుదల చెయ్యబోతున్నాడు రాజమౌళి. రంగస్థలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ ను రిపోర్టర్స్ రాజమౌళి సినిమా గురించి అడగ్గా.. సినిమా విషయాలు బయటికి చేపోద్దని రాజమౌళి చెప్పినట్లు చరణ్ వెల్లడించాడు.