వైరల్ అవుతోన్న ‘ఎన్టీఆర్ – చరణ్’ల కామెంట్స్ !

Published on Aug 4, 2019 3:04 pm IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమా చేస్తోన్న క్రమంలో చరణ్ అండ్ ఎన్టీఆర్ ల మధ్య ఫ్రెండ్షిప్ కూడా చాల బలంగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. వీరిద్దరూ సోషల్‌మీడియాలో విడివిడిగా తమ ఫ్రెండ్షిప్ కి సంబంధించి పోస్ట్ చేశారు. ముందుగా ఎన్టీఆర్ పోస్ట్ చేస్తూ.. ‘గొప్ప స్నేహం నెమ్మదిగానే మొదలవుతుంది. కానీ ఆ స్నేహాన్ని శాశ్వతంగా కాపాడుకోండి’ అనే అర్థం వచ్చేలా ఎన్టీఆర్ పోస్ట్ చేస్తూ.. ‘మన ఫ్రెండ్షిప్ ని ఈ మాట కంటే గొప్పగా నిర్వచించలేం’ అని చరణ్ తో దిగిన ఫోటోను కూడా కలిపి ఎన్టీఆర్ పోస్ట్ చేశారు.

అలాగే స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. ఎన్టీఆర్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చరణ్ పోస్ట్ చేస్తూ.. ‘కొన్ని బంధాలు బలపడటానికి చాలా సమయం పడుతుంది. కానీ ఒక్కసారి ఆ బంధాలు ఏర్పడ్డాక జీవితాంతం అలానే ఉంటాయి. నాకు తారక్‌ తో అలాంటి బంధం ఏర్పడింది. మై భీమ్‌..’ అంటూ ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు చరణ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇద్దరి హీరోల పోస్టులే బాగా వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :