తెలుగుతో పాటు హిందీలో కూడ రూపొందనున్న ‘ఎన్టీఆర్’ చిత్రం !

దర్శకుడు తేజ నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో దివంగత నందమూరి తారక రామారావుగారి జీవితాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఎన్టీఆర్’ అనే పేరును ఖరారుచేశారు. ఈ నెల 29న హైదరాబాద్లోని రామకృష్ణ స్టూడియోస్ లో అశేష అభిమానులు, ఇతర పెద్దల నడుమ ఈ చిత్ర ప్రారంభోత్సవం జరగనుంది.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడ ఒకేసారి రూపొందించి రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలక్రిష్ణలు స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రాన్ని సంగీతాన్ని అందించనున్నారు.