ఎన్టీఆర్, చరణ్ సినిమా మొదలయ్యేది అప్పుడే !

1st, February 2018 - 11:49:24 AM

రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ & చరణ్ మల్టీ స్టారర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో ఇద్దరు హీరోలు పోలీస్ పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రారంభంకానుంది. ఇద్దరు హీరోల పాత్రలు సమానంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు దర్శకుడు రాజమౌళి. సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చెయ్యాలనేది చిత్ర యూనిట్ ఆలోచన.

ఈ సినిమాలో గ్రాఫిక్స్, సెట్స్ ఉండవు. బలమైన కథ కథనాలతో పక్కా స్క్రిప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాకు సంభందించి నటినటులు ఎంపిక త్వరలో జరగనుంది. ప్రస్తుతం చరణ్ నటించిన ‘రంగస్థలం’ వచ్చే నెలలో విడుదలకానుంది. ఈ సినిమా తరువాత బోయపాటి సినిమా సెప్టెంబర్ లో పూర్తి అవుతుంది. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ కూడా సెప్టెంబర్ లో ఫినిష్ అవ్వొచ్చు కావున అక్టోబర్ నుండి రాజమౌళి సినిమాలో పాల్గొనబోతున్నారు ఈ ఇద్దరు హీరోలు.