మల్టీ స్టారర్ పనుల్ని మొదలుపెట్టిన ఎన్టీఆర్, చరణ్ !
Published on Mar 7, 2018 1:53 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ కలిసి రాజమౌళితో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రకటితమైన మొదటిరోజు నుండే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. దర్శకుడు రాజమౌళి ఈ పనుల మీదే యూఎస్ వెళ్లగా చరణ్, ఎన్టీఆర్ కూడ విదేశాలకు బయలుదేరారు. ఇరువురూ విమానాశ్రయంలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి.

సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఇద్దరూ కలిసి లుక్ టెస్ట్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్లు, ఇతర నటీనటులలు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి. ఈ ఏడాదిలో రూపొందనున్న ఈ అతి పెద్ద మల్టీ స్టారర్ పై ప్రేక్షకుల్లోనూ, సినీ జనాల్లోనూ భారీ అంచనాలున్నాయి.

 
Like us on Facebook