యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగ్ననాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న సంగతి ఇది వరకే తెలియజేశాం. గత కొద్ది రోజులుగా బేగం పేట గులాబీ హౌస్ లో వేసిన పోలీస్ స్టేషన్ సెట్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ నేటితో ముగియనుంది. రేపు ఒక్కరోజు గ్యాప్ తీసుకొని తదుపరి షెడ్యూల్ కోసం గోవా వెళ్లనున్నారు.
ఈ చిత్ర టీం అంతా 17న గోవా చేరుకొని అక్టోబర్ 20 నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నారు. అక్కడ సినిమాకి సంబందించిన కొన్ని కీలక సన్నివేషాలను షూట్ చేయనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో నోర ఫతేహి ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ టిపికల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ‘బాద్షా’ తర్వాత బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


