ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదుగా..!

Published on Jul 9, 2020 2:20 pm IST


నేడు ఎన్టీఆర్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ సింహాద్రి విడుదలై 17ఏళ్ళు పూర్తి చేసుకుంది. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో రెండవ చిత్రంగా వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఎన్టీఆర్ 7వ చిత్రంగా వచ్చిన సింహాద్రి ఆయనకు ఫస్ట్ ఇండస్ట్రీ హిట్. అప్పటికే ఆది మూవీతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్… సింహాద్రి విజయంతో స్టార్ హీరో అయిపోయాడు.

కాగా కొద్దిరోజులుగా సింహాద్రి 17ఇయర్స్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ట్విట్టర్ లో సింహాద్రి మూవీ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే 6 మిలియన్ ట్వీట్స్ కి సింహాద్రి మూవీ యాష్ ట్యాగ్ చేరినట్లు సమాచారం. ఇక సింహాద్రి సినిమా రికార్డులు, కలెక్టన్స్, 100డేస్, 150 డేస్, 175 డేస్ సెంటర్స్ లిస్ట్ పంచుకుంటూ పండుగ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో ఫ్యాన్స్ ఇంత పెద్ద ఎత్తున హంగామా చేయలేదు.

సంబంధిత సమాచారం :

More